బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ పాక్ మాజీ ప్రధాని జనరల్ పర్వేజ్ ముషార్రఫ్‌తో భేటీ అయ్యారు. దుబాయ్ వేదికగా వీరిద్దరి భేటీ జరిగింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే దుబాయ్‌లోని ఓ జిమ్‌లో వీరిద్దరూ కలుసున్నట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలో పాక్ మాజీ ప్రధాని ముషార్రఫ్ వీల్‌చైర్‌లో కూర్చున్నది స్పష్టంగా కనిపిస్తుంది. సంజయ్ దత్ మాత్రం బ్లాక్ టీ షర్ట్ వేసుకొని, ఏదో మాట్లాడుతున్నట్లు కనిపించింది.
Former President #PervaizMusharraf and Indian actor #SanjayDutt met accidentally yesterday in #Dubai. pic.twitter.com/nyh7kygZUO
— Hani Qureshi (@HaniQureshi5) March 16, 2022