న్యూఢిల్లీ: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆర్మీ అధికారులపై సాయుధ దళాల చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహేతర సంబంధం నేరం కాదని 2018లో వెలువరించిన తీర్పు సాయుధ దళాల చట్టాలకు వర్తించదని పేర్కొన్నది. 2018 తీర్పు నుంచి సాయుధ దళాలకు మినహాయింపు ఇవ్వాలని, ఈ తీర్పు వారిపై చర్యలు తీసుకోవడంలో ఆటంకంగా మారిందని కేంద్ర రక్షణ శాఖ సుప్రీంను ఆశ్రయించింది. ఈ తీర్పు సాయుధ బలగాలకు వర్తించదని, వారిపై చర్యలు తీసుకోవచ్చని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొన్నది.