ACC : కేంద్ర ప్రభుత్వం (Union government) ఆరుగురు సీనియర్ న్యాయవాదుల (Senior advocates) ను సుప్రీంకోర్టు (Supreme Court) లో అదనపు సొలిసిటర్ జనరల్‌లు (Solicitor Generals) గా నియమించింది. క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ (Appointments committee of the Cabinet – ACC) వారి నియామకానికి ఆమోదం తెలిపింది.
భారత సర్వోన్నత న్యాయస్థానంలో అదనపు సొలిసిటర్ జనరల్‌లుగా నియమితులైన వారిలో ఎస్ ద్వారాకనాథ్ (S. Dwarakanath), అర్చన పాథక్ దేవె (Archana Pathak Dave), సత్యదర్శి సంజయ్ (Satya Darshi Sanjay), బ్రిజేందర్ చాహర్ (Brijender Chahar), రాఘవేంద్ర పీ శంకర్ (Raghavendra P. Shankar), రాజ్‌కుమార్ భాస్కర్ థాకరే (Rajkumar Bhaskar Thakare) ఉన్నారు.