న్యూఢిల్లీ: భారతీయ వాతావరణ శాఖ ఇవాళ కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా జూన్‌లో సాధారణం కన్నా అధిక వర్షపాతం(Monsoon Rainfall) నమోదు కానున్నట్లు చెప్పింది. జూన్ నెలలో సుమారు 108 శాతం వర్షం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఐంఎడీ పేర్కొన్నది. అయితే ఈ వర్షాకాలంలో దేశవ్యాప్తంగా 106 శాతం వర్షపాతం ఉంటుందని, సగటును 87 సెంటీమీటర్ల వర్షం కురవనున్నట్లు ఐఎండీ చెప్పింది.
మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌కు చెందిన కార్యదర్శి ఎం రవిచంద్రన్ ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడారు. వర్షాకాలానికి చెందిన కోర్ జోన్లో ఈసారి సాధారణం కన్నా ఎక్కువ ర్షం నమోదు అవుతుందన్నారు. మాన్సూన్ కోర్ జోన్లో మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, ఒడిశా ప్రాంతాలు వస్తాయి. నైరుతి రుతుపవనాల సమయంలో ఈ ప్రాంతానికి ఎక్కువ శాతం వర్షం వస్తుంది. ఈ ప్రాంతంలోని వ్యవసాయం మొత్తం నైరుతి మీద ఆధారపడి ఉంటుంది.
వాయువ్య భారతంలో ఈసారి సాధారణ స్థాయి వర్షం ఉండనున్నది. ఈశాన్యలో ఈసారి సాధారణం కన్నా తక్కువ వర్షం ఉంటుందని ఐఎండీ పేర్కొన్నది. సెంట్రల్తో పాటు దక్షిణ ద్వీపకల్ప భాగంలో సాధారణం కన్నా ఎక్కువ స్థాయిలో వర్షం పడనున్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు.
Updated Long Range Forecast For the Southwest Monsoon Seasonal Rainfall during 2025
Quantitatively, the southwest monsoon seasonal (June to September, 2025) rainfall over the country as a whole is likely to be 106% of LPA (Long Period Average) with a model error of ± 4%
This… pic.twitter.com/D6VzUjMHSQ
— India Meteorological Department (@Indiametdept) May 27, 2025