సిద్ధూ, బిక్రమ్ సింగ్‌ను ఓడించిన… ఆప్ మహిళా అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మహిళా అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్ ఓడించారు. అమృత్సర్ ఈస్ట్‌లో పోటీ చేసిన ఆమె సిద్ధూతోపాటు అదే స్థానంలో బరిలోకి దిగిన శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) నేత బిక్రమ్ సింగ్ మజితియాపైనా విజయం సాధించారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడైన సిద్ధూ అమృత్సర్ ఈస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యే. బిక్రమ్ సింగ్ మజితియా మాజీ మంత్రి, ఎస్ఏడీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ బంధువు.
అమృత్సర్ ఈస్ట్‌లో కీలక నేతలైన సిద్ధూ, బిక్రమ్ సింగ్‌పై మహిళా అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్‌ను ఆప్ పోటీకి దించింది. గట్టి పోటీని ఎదుర్కొన్న ఆమె 39,679 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సిద్ధూ 32,929 ఓట్లతో తర్వాత స్థానంలో, 25,188 ఓట్లతో బిక్రమ్ సింగ్ మూడో స్థానంలో నిలిచారు.
కాగా, పంజాబ్ ప్రజలు ఈ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇచ్చారు. తొలిసారి ఆప్‌కు పట్టం కట్టారు. మరోవైపు తాజా కాంగ్రెస్ సీఎం చరణ్ జిత్ చన్నీ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. అలాగే మాజీ ముఖ్యమంత్రులు ప్రకాష్ సింగ్ బాదల్, సుఖ్బీర్ సింగ్ బాదల్ జలాలాబాద్‌లో, కెప్టెన్ అమరీందర్ సింగ్ పాటియాలాలో ఓడిపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

