Arvind Kejriwal : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేయడాన్ని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ స్వాగతించారు. ఎంతటి నియంతృత్వమైనా ఒకనాటికి సమసిపోక తప్పదని బీజేపీపై ఆయన విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ ఇప్పుడు జైలు నుంచి బయటకు రానున్నారని, ఈరోజు కోసం వేచిచూసిన వారందరికీ అభినందనలు తెలియచేస్తున్నానని, ఇవాళ ప్రజలంతా పండగ జరుపుకుంటారని గోపాల్ రాయ్ పేర్కొన్నారు.
నియంతృత్వ పోకడలు ఎంతటి స్ధాయిలో ఉన్నా ఏదోఒక రోజు వాటికి చెల్లుచీటీ తప్పదని ఇవాళ ఢిల్లీ సహా, దేశమంతటికీ ఈ తీర్పు ఓ సందేశం పంపిందని ఆయన వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌పై పన్నిన కుట్రలన్నీ ఇప్పుడు విఫలమయ్యాయని, కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే భారీ వేడుకలు నిర్వహిస్తామని ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేయడం ఆప్‌నకు భారీ విజయమని అభివర్ణించారు. బీజేపీ రూపొందించిన నకిలీ స్కామ్ ఇప్పుడు బట్టబయలైందని అన్నారు.
కాగా, లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. సీబీఐ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌కి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సర్వోన్నత న్యాయస్ధానం తీర్పుతో 6 పాటు జైలుజీవితం గడిపిన ఆయన జైలు నుంచి విడుదలకానున్నారు. రూ.10లక్షల బాండ్ సమర్పించాలని, కేసుకు సంబంధించి పెదవివిప్పరాదని, కేసు విచారణ కోసం ట్రయల్ కోర్టు ఎదుట హాజరుకావాలంటూ సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ అరెస్టుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును సవాల్ చేయడంతో పాటు బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
Read More :
Kaushik Reddy | కాంగ్రెస్ వాళ్లకు ఓ చట్టం.. తమకో చట్టమా: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి