చండీగఢ్, మార్చి 11: పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ బుధవారం(ఈ నెల 16) ప్రమాణం చేయనున్నారు. భగత్ సింగ్ పూర్వీకుల గ్రామం ఖాట్కర్ కలాన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వర్గాలు తెలిపాయి. ఆదివారం పంజాబ్‌లో విజయోత్సవ ర్యాలీ ఉంటుందని పేర్కొన్నాయి. ఈ రెండు కార్యక్రమాలకు ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ హాజరవుతారని తెలిపాయి. శుక్రవారం ఉదయం భగవంత్ మాన్ కేజ్రీవాల్‌ను ఢిల్లీలో ఆయన నివాసంలో కలిశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆప్ పంజాబ్‌లో 92 సీట్లతో బ్రహ్మాండమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పంజాబ్ సీఎం చన్నీ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామాలను ఆయా రాష్ర్టాల గవర్నర్లకు సమర్పించారు.