అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారన్న ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన 8 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
‘మోదీ హటావో.. దేశ్ బచావో’ అనే పోస్టర్ ప్రచారాన్ని ఇటీవల ఆప్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గుజరాత్‌లోనూ ఈ పోస్టర్లు వెలిశాయి. అయితే పోస్టర్లు అంటించడం వల్ల పబ్లిక్ ప్రాపర్టీకి నష్టం జరిగిందన్న అభియోగాలపై 8 మందిని అరెస్టు చేశారు. ఈ అరెస్టులను ఆప్ తీవ్రంగా ఖండించింది.