న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ సమావేశం రచ్చ రచ్చ(AAP Vs BJP)గా మారింది. బుధవారం ఉదయం మేయర్‌ను ఎన్నుకున్న తర్వాత. రాత్రి ఎంసీడీ సమావేశాల్లో బీజేపీ(BJP), ఆప్(AAP) కౌన్సిలర్లు బాహాబాహీకి దిగారు. స్టాండింగ్ కమిటీ(Standing Committee) సభ్యుల ఎన్నిక సమయంలో ఈ గందరగోళం ఏర్పడింది. రెండు పార్టీలకు చెందిన నేతలు దాదాపు తన్నుకున్నారు. ఓ దశలో వాళ్లు ఒకరిపై ఒకరు వాటర్ బాటిళ్లు విసిరేసుకున్నారు. ఇక బీజేపీ కౌన్సిలర్లు మేయర్ చైర్ వద్దకు వెళ్లి బ్యాలెట్ బాక్సుల్ని ఎత్తిపారేశారు. బుధవారం సాయంత్రం ప్రారంభమైన ఆ డ్రామా.. అర్థరాత్రి తర్వాత కూడా కొనసాగింది. దాదాపు అయిదారుసార్లు సభను వాయిదా వేశారు.
#WATCH | Delhi: Ruckus between BJP & AAP members inside the MCD house over the election of members of the standing committee. pic.twitter.com/alIZFIFFnr
— ANI (@ANI) February 22, 2023
బీజేపీ కౌన్సిలర్లు తనపై దాడి చేసినట్లు కొత్తగా ఎన్నికైన మేయర్ షెల్లీ ఒబెరాయ్(Shelly Oberoi) ఆరోపించారు. కానీ కేవలం మేయర్‌తో చర్చ చేపట్టేందుకు మాత్రమే తాము ప్రయత్నించామని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీ కౌన్సిలర్లు మేయర్ పోడియం వద్ద ఉన్న టేబుల్‌ను ఎక్కి హంగామా చేశారు. సుప్రీం ఆదేశాల ప్రకారం స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహిస్తుంటే.. బీజేపీ కౌన్సిలర్లు తమపై దాడి చేసినట్లు షెల్లీ ఒబెరాయ్ తన ట్విట్టర్లో తెలిపారు.
देखिए भाजपा की गुंडागर्दी का एक और नमूना: स्टैंडिंग कमिटी के चुनाव को रोकने के लिए भाजपा के पार्षदों ने बैलट बॉक्स को चुरा लिया! आख़िर चुनाव से इतना क्यों डर रही है भाजपा! pic.twitter.com/t9LoRTpvyh
— Atishi (@AtishiAAP) February 22, 2023
స్టాండింగ్ కమిటీ ఓటింగ్ సమయంలో కొందరు సభ్యులు సెల్ఫోన్లు పట్టుకుని ఓటు వేసేందుకు వెళ్లారు. దీంతో ఆప్, బీజేపీ మధ్య గొడవ ప్రారంభమైంది. ఓటింగ్‌ను ఆపేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. కానీ ఇవాళ స్టాండింగ్ కమిటీ ఎన్నిక పూర్తి కావాలని షెల్లీ భీష్మించారు. కౌన్సిలర్లు సెల్ఫోన్లతో ఓటింగ్‌కు వెళ్తున్నారని, తొలుత పోలైన 50 ఓట్లను రద్దు చేయాలని బీజేపీ నేత హరీశ్ ఖురానా డిమాండ్ చేశారు.
స్టాండింగ్ కమిటీలో ఆరుగురు సభ్యులు ఉంటారు. దాంట్లో మూడు ఆప్, రెండు బీజేపీ గెలవనున్నది. అయితే మరో సీటుపై ఆసక్తి నెలకొన్నది.అయితే ఉద్రికత్తల నడుమ రేపటికి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్ని వాయిదా వేశారు.