మంగళవారం 02 మార్చి 2021
National - Jan 18, 2021 , 19:53:23

ఆప్ ఎంపీ సంజ‌య్‌సింగ్‌కు బెదిరింపులు

ఆప్ ఎంపీ సంజ‌య్‌సింగ్‌కు బెదిరింపులు

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పార్ల‌మెంట్ స‌భ్యుడు సంజయ్ సింగ్‌కు చంపుతామంటూ బెదిరింపులు వ‌స్తున్నాయి. దాంతో తగు చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఆయ‌న‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'హిందూ వాహిని' నుంచి గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఫోన్ చేసి చంపేస్తాన‌ని బెదిరించాడ‌ని సంజ‌య్‌సింగ్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

"7288088088 మొబైల్ నంబర్ నుంచి నాకు తెలియని వ్య‌క్తి నుంచి కాల్స్ వస్తున్నాయి. సోమవారం, కాల్ నా ఫోన్ నుంచి నా సహోద్యోగి అజిత్ త్యాగి ఫోన్‌కు మళ్లించాను. మధ్యాహ్నం 3.59 గంటలకు అతను కాల్ తీసుకున్నప్పుడు, కాల్ చేసిన వ్యక్తి త‌నను చంపేస్తానంటూ బెదిరించాడు. ఫోన్ చేసిన వ్య‌క్తి త‌న‌కు తానుగా హిందూ వాహిని నుంచి మాట్లాడుతున్న‌ట్లు తెలిపాడు. కిరోసిన్ పోసి సజీవ దహనం చేస్తాను ”అని బెదిరించాడ‌ని త‌న‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంఘటనను సింగ్ ట్విట్ చేశాడు. బెదిరింపు ఫోన్ కాల్స్ చేసిన వ్య‌క్తిపై చ‌ట్ట‌రీత్యా త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన‌ట్లు సంజ‌య్ సింగ్ తెలిపారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo