న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కుమారుడిపై ఢిల్లీ పోలీసులు కేసు బుక్ చేశారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన కేసులో అతన్ని మందలించారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించినందుకు కూడా అతనిపై కేసు బుక్ చేశారు. వివిధ రకాలుగా ట్రాఫిక్ ఉల్లంఘనల(Dangerous Driving)కు పాల్పడిన ఎమ్మెల్యే కుమారుడిపై 20 వేల జరిమానా కూడా విధించారు. బాట్లా హౌజ్ వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో.. ఇద్దరు అబ్బాయిలు ఓ మోటర్‌సైకిల్‌పై రాంగ్ లేన్‌లో రైడింగ్ చేస్తూ కనిపించారు. మార్చిన సైలెన్సర్‌తో పెద్దగా సౌండ్ చేస్తూ దూసుకెళ్లారు. వాహనాన్ని ఇష్టంవచ్చినట్లుగా రైడ్ చేశారు. ఆ మోటర్‌సైకిల్‌ను అడ్డుకుని, పోలీసులు ఆ రైడర్లను విచారించారు.
వాహనం నడిపిన వ్యక్తి ఆప్ ఎమ్మెల్యేకు ఫోన్ చేశారని, అయితే ఆ వ్యక్తి జామియా నగర్ ఎస్‌హెచ్‌వోతో చాలా దురుసుగా మాట్లాడినట్లు తేలింది. బైక్ రైడింగ్ చేస్తున్న వ్యక్తి పోలీసులతో అనుచితంగా ప్రవర్తించాడు. ఆప్ స్టిక్కర్ ఉన్నా.. కావాలని బైక్‌ను ఆపారని ఆ బైకర్ ఆరోపించాడు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కావాలని పోలీసులు అడగ్గా, తాను లోకల్ ఎమ్మెల్యే కుమారుడిని అని చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసు ఆఫీసర్‌తో ఫోన్లో ఎమ్మెల్యే దరుసుగా ప్రవర్తించాడని, నన్ను కూడా అరెస్టు చేయాలని ఆ ఎమ్మెల్యే బెదిరించినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకుని, మోటారు వెహికిల్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. మాడిఫైడ్ సైలెన్సర్‌పై 5వేలు, పోలీసుతో దురుసు ప్రవర్తనకు రెండు వేలు, డ్రైవింగ్ లైసెన్స్ లేనందుకు 5వేలు, హెల్మెట్ లేనందకు రెండు వేలు, ప్రమాదకర డ్రైవింగ్‌కు వెయ్యి జరిమానా విధించారు.