AAP MLA : ఢిల్లీలో అధికార ఆమ్ఆద్మీ పార్టీ (AAP) కి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రాజేంద్రపాల్ గౌతమ్ (Rajendra Pal Gautam) కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. ఇవాళ ఆప్‌కు రాజీనామా చేసి, వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ఆయనకు మువ్వన్నెల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అయితే ఎమ్మెల్యే రాజేంద్రపాల్ గౌతమ్ ఆకస్మిక నిర్ణయం ఆప్‌కు షాకిచ్చింది. ఆయనకు కేసీ వేణుగోపాల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు పవన్ ఖేరా, ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ దేవేందర్ యాదవ్ కూడా ఆయన వెంటే ఉన్నారు.
#WATCH | Delhi AAP MLA Rajendra Pal Gautam joins Congress in the presence of party’s general secretary KC Venugopal, party’s Delhi chief Devender Yadav and party leader Pawan Khera. pic.twitter.com/jDck78d4ND
— ANI (@ANI) September 6, 2024