హైదరాబాద్ : మావోయిస్టు( Maoists) పార్టీకి మాస్టర్‌మైండ్‌గా పేరున్న మద్వి హిడ్మా(Madvi Hidma) ఎన్కౌంటర్ బూటకమని మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. ఇప్పుడు ఈ లేఖ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు చెందిన ఓ కాంగ్రెస్ నేత చేసిన మోసం వల్లే హిడ్మా చనిపోయారని ఆ ఆపార్టీ అల్లూరి సీతారామారాజు డివిజన్ అధికార ప్రతనిధి విప్లవ్ పేరుతో లేఖ విడుదల చేశారు. హిడ్మాకు హాస్పిటల్లో వైద్యం అందిస్తానని నమ్మబలికి పోలీసులకు సమాచరమిచ్చి కాల్చి చంపారన్నారు. ఆ ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఎన్కౌంటర్ చేశారని లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టు హిట్ లిస్టులో ఉన్న రాజకీయ నాయకులకు ప్రజా కోర్టులుతో శిక్ష తప్పదని, ఖబర్దార్ కాంట్రాక్టర్లు, రాజకీయనాకులు అంటూ హెచ్చిరించారు.
కాగా, మావోయిస్టు పార్టీ కీలక నేత, పీపుల్స్ గెరిల్లా సుప్రీం లీడర్, ఎర్రదళం సేనాధిపతి మద్వి హిడ్మా అలియాస్ సంతోష్ ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయాడు. అతనితోపాటు భార్య రాజే పోలీసుల తూటాలకు నేలకొరిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కొరకరాని కొయ్యగా మారిన సేనాధిపతి హిడ్మాపై డేగ కన్నెసి, అనేక కోవర్టు ఆపరేషన్లు జరిపిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లోని మారెడుమిల్లి అడవుల్లో అతని ప్రస్థానానికి తెరపడింది. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారెడుమిల్లి మండలం టైగర్ జోన్ ప్రాంతంలోని నల్లూరు జలపాతం వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో హిడ్మాతోపాటు ఆయన భార్య రాజే(డీవీసీఎం), లక్మల్ అలియాస్ చైతు, మల్లా అలియాస్ మల్లలు, కమ్లూ అలియాస్ కామ్లేశ్ మృతిచెందిన విషయం తెలిసిందే.