గుజరాత్ పోరు : హార్ధిక్ పటేల్‌ను తమ పార్టీలో చేరాలని కోరిన ఆప్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని యోచిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కాంగ్రెస్ నేత హార్ధిక్ పటేల్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది.
అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని యోచిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కాంగ్రెస్ నేత హార్ధిక్ పటేల్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. హార్ధిక్ పటేల్ సమయం వృధా చేయకుండా తమ పార్టీలో చేరాలని గుజరాత్ ఆప్ చీఫ్ గోపాల్ ఇటాలియా రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్ధిక్ పటేల్‌ను కోరారు. కాంగ్రెస్ పార్టీ తన సేవలను సమర్ధంగా ఉపయోగించుకోకుండా పక్కనపెట్టిందని హార్ధిక్ పటేల్ బుధవారం కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
అయితే తాను కాంగ్రెస్ పార్టీని వీడబోనని ఆయన పేర్కొన్నారు. పార్టీలో సమస్యలు, భేదాభిప్రాయాలు ఉన్నా తామంతా గుజరాత్ బాగు కోసం కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు. హార్ధిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీని ఇష్టపడని పక్షంలో ఆప్ వంటి భావసారూప్యం కలిగిన పార్టీలో చేరాలని పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి వెల్లడిస్తూ కాలయాపన చేయకుండా ఆయన ఆప్‌లో చేరడం మేలని సూచించారు.
మరోవైపు తాను కాంగ్రెస్ పార్టీని వీడతానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని హార్ధిక్ పటేల్ తోసిపుచ్చారు. కాంగ్రెస్ పార్టీకి తన సేవలు భవిష్యత్‌లోనూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. 2015లో ఓబీసీ కోటా కింద రిజర్వేషన్లు కోరుతూ పటేల్ ఉద్యమానికి నాయకత్వం వహించిన హార్ధిక్ పటేల్‌ను రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆపై 2020లో గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా హార్ధిక్ పటేల్ బాధ్యతలు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- Gujarat
- Hardik Patel
RELATED ARTICLES
తాజా వార్తలు
పెట్టుబడిదారులకు రక్షణ కరువు.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు లేవు
మోదీజీ.. ఎంతమంది పోలీసులనైనా తెచ్చుకోండి.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

