Raghav Chadha: రాఘవ్ చద్దాకు షాకిచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ
Raghav Chadha: రాజ్యసభ డిప్యూటీ లీడర్ హోదా నుంచి ఎంపీ రాఘవ్ చద్దాను ఆమ్ ఆద్మీ పార్టీ తప్పించింది. అతని స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్‌ను భర్తీ చేసింది. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో అశోక్ మిట్ల్ ఛాన్సలర్‌గా ఉన్నారు. అయితే రాఘవ్‌ను ఎందుకు తప్పించారో ఆ పార్టీ చెప్పలేదు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ తమ స్వంత ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha)కు షాకిచ్చింది. రాజ్యసభ డిప్యూటీ నేత హోదా నుంచి అతన్ని తప్పించింది. అతని స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్‌ను భర్తీ చేసింది. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో అశోక్ మిట్ల్ ఛాన్సలర్‌గా ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభలో ఎంపీ సంజయ్ సింగ్ ఆ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభలో మొత్తం 10 మంది సభ్యులు ఉన్నారు. పంజాబ్ నుంచి ఏడుగురు, ఢిల్లీ నుంచి ముగ్గురు ఉన్నారు. రాజ్యసభలో బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ తర్వాత నాలుగవ అతిపెద్ద పార్టీగా ఆప్ నిలిచింది.
అయితే రాఘవ్ చద్దాను డిప్యూటీ నేత స్థానం నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఓ సమయంలో ఆప్‌లో అతను కీలక నేతగా వ్యవహరించారు. కేజ్రీవాల్‌తో అత్యంత సన్నిహితంగా ఆయన ఉండేవారు. ఆప్ పుట్టిన నాటి నుంచి 37 ఏళ్ల చద్దా ఆ పార్టీతోనే ఉన్నారు. ఢిల్లీ మాడర్న్ స్కూల్ అల్యూమినిలో ఉన్న ఆయన.. ఛార్టర్డ్ అకౌంటెంట్ కూడా. అవినీతి ఉద్యమం చేపడుతున్న రోజుల్లో కేజ్రీవాల్‌కు చద్దా పరిచయమయ్యారు.23 ఏళ్ల వయసులో ఆప్‌లో రాఘవ్ చద్దా కీలక పాత్ర పోషించారు.
ఢిల్లీ లోక్‌పాల్ బిల్లు ఏర్పాటులో ముఖ్య భూమిక నిర్వర్తించారు. ఆమ్ ఆద్మీ జాతీయ ప్రతినిధి చద్దా ఫేమస్ అయ్యారు. అనేక టీవీ చర్చల్లో పాల్గొన్నారు. 26 ఏళ్ల వయసులోనే ఆ పార్టీ జాతీయ కోశాధికారిగా అతన్ని నియమించారు. 2020 ఢిల్లీ ఎన్నికల్లో రాజిందర్‌నగర్ నుంచి ఎన్నియ్యారు. ఢిల్లీ జల సంఘంలో వైస్ చైర్మెన్‌గా చేరారు. 2022లో రాజ్యసభకు ఎంపిక చేశారు. అయితే రాఘవ్ చద్దాను ఎందుకు డిమోట్ చేశారన్న దానిపై ఆమ్ ఆద్మీ నేతలు కారణం వెల్లడించలేదు. ఇటీవల అనేక పార్టీ కార్యక్రమాలకు రాఘవ్ దూరంగా ఉన్నారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు క్లీన్ చిట్ ఇచ్చిన అంశంపై కూడా ఆయన స్పందించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

