Shiv Sena (UBT) : ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీయే వంద రోజుల ప్రణాళికలో చేసిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని శివసేన (UBT) నేత ఆదిత్య ఠాక్రే ఆరోపించారు. భారత్‌కు దిశానిర్ధేశం చేసే సత్తా ఉన్న నూతన నాయకత్వం, ప్రభుత్వం అవసరమని అన్నారు. ఠాక్రే సోమవారం ముంబైలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మోదీ సర్కార్‌పై తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్డీయే ప్రభుత్వం ఓ దశ దిశ లేకుండా వ్యవహరిస్తున్నదని అన్నారు.
నూతన, ప్రత్యామ్నాయ ప్రభుత్వంతో త్వరలో విపక్ష ఇండియా కూటమి అధికార పగ్గాలు చేపడుతుందని పేర్కొన్నారు. కాగా, జన గణన నిర్వహించకపోవడం మోదీ ప్రభుత్వ బలహీనతను వెల్లడిస్తోందని కర్నాటక మంత్రి, కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే అన్నారు. గణాంకాలు లేకపోవడంతో మోదీ ప్రభుత్వం విధాన వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని దుయ్యబట్టారు. ప్రియాంక్ ఖర్గే సోమవారం బెంగళూర్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్డీయే అంటే నో డేటా అవైలబుల్ అని ఆయన అభివర్ణించారు.
మరోవైపు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత రవ్నీత్ బిట్టూ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. బీజేపీ నేతలు చిత్తశుద్ది కోల్పోయారని తాను భావిస్తు్న్నానని చెప్పారు. రాహుల్ గాంధీకి వేర్పాటువాదులు, ఉగ్రవాదులే వత్తాసు పలుకుతారని బిట్టూ తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. తనకు తెలిసినంత వరకూ ఉగ్రవాదులు పార్లమెంట్ సభ్యులు కాలేరని అన్నారు. రాహుల్‌ను విమర్శించాలనుకునే వీరంతా తామే చెడుగా చిత్రీకరింపబడతారని వ్యాఖ్యానించారు. కాగా, అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ తీవ్రంగా ఖండించారు.
Read More :