న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఆధార్‌ను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును యూఐడీఏఐ మరో ఆరు నెలలు పొడిగించింది. వాస్తవానికి ఈ గడువు శనివారంతో ముగియగా, దానిని వచ్చే ఏడాది జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. దీని కారణంగా లక్షలాది మంది పౌరులకు ప్రయోజనం చేకూరనుంది.
ఆధార్‌లోని పేరు, లింగం, పుట్టిన తేదీ, చిరునామా తదితరాలను మార్చుకోవాలనుకే వారు https:// myaadhaar /uidai.gov.in పోర్టల్‌లోకి వెళ్లి తమ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చునని యూఐడీఏఐ వివరించింది.