న్యూఢిల్లీ : హాస్టల్ జీవితంలో కష్టాలు దాదాపు ప్రతిఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో అనుభవమే. తాజాగా ఓ హాస్టల్లో బ్రేక్‌ఫాస్ట్‌గా వడ్డించిన పరాటా వీడియోను ఓ మహిళ నెట్టింట షేర్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పరాట చాలా గట్టిగా ఉండటంతో యూజర్ల నుంచి పెద్ద ఎత్తున రియాక్షన్స్ వచ్చాయి.
Hostel ka khana🙃 pic.twitter.com/8FiLCwtZ33
— Sakshi Jain • Content Strategist (@thecontentedge) February 16, 2023
సాక్షి జైన్ అనే మహిళ ఈ వీడియోను షేర్ చేయగా ఇప్పటివరకూ 30,000కుపైగా వ్యూస్ లభించాయి. టేబుల్‌పై పరాటాను ఎంత గట్టిగా కొట్టినా అది బ్రేక్ అవకపోవడం ఈ క్లిప్‌లో కనిపిస్తుంది. హాస్టల్ భోజనం అంటూ ఈ పోస్ట్‌కు ఆమె క్యాప్షన్ ఇచ్చారు.
పలువురు దీన్ని ఐరన్ అధికంగా ఉండే హ్యామర్ పరాటాగా పిలిచారు. ఇక రాజ్‌పాల్ యాదవ్, షాహిద్ కపూర్ల చుప్ చుప్ కే మూవీలోని సీన్‌ను ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు గుర్తుచేశారు. ఈ సీన్లో తనకు ఇచ్చిన గట్టి పరోటాను కట్ చేసేందుకు రాజ్‌పాల్ యాదవ్ క్యారెక్టర్ రంపం ఇవ్వాలని కోరుతుంది.