ధన్‌బాద్: అయోధ్యలో రామమందిరం నిర్మించాలని ఓ మహిళ 32 ఏండ్లుగా మౌనవ్రతం చేస్తున్నారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన సరస్వతి దేవి (85).. బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు (1992, డిసెంబర్ 6) నుంచి మౌనవ్రతాన్ని కొనసాగిస్తున్నారు. ‘మౌనీ మాత’గా ఫేమస్ అయిన ఈమె.. ఎవరితో ఏదైనా చెప్పాలంటే సంజ్ఞలతోనే చెప్పేవారు.
2020 వరకు ప్రతి రోజు ఒక గంట మాట్లాడేవారు. 2020లో రామమందిరానికి పునాది వేసిన రోజు నుంచి పూర్తిగా మౌనవ్రతం చేపట్టారు. అయోధ్యలో రాము డి ప్రాణప్రతిష్ఠ అనంతరం దీక్ష విరమించనున్నారు. అయోధ్య పురవీధుల్లో ఈ నెల 17న రామ్‌లల్లా విగ్రహాన్ని ఊరేగించాలన్న నిర్ణయం పై రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు వెనక్కి తగ్గింది. భద్రతా కారణాల రీత్యా ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు తెలిపింది.
Dhanbad
యూపీలో మద్యం, విద్యాసంస్థలు బంద్
ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈ నెల 22న యూపీలోని అన్ని విద్యాసంస్థలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అలాగే మద్యం దుకాణాలన్నీ మూసేయాలని ఆదేశించింది.