బెంగళూర్ : రాత్రి వేళ అటవీ ప్రాంతంలో బస్ వెళుతుండగా వాహనం ముందు నుంచీ ఓ ఏనుగు, పిల్ల ఏనుగు రోడ్డు దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కర్నాటకలోని దండేలీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి వేళ జంగిల్లో డార్క్ రోడ్డుపై తన ప్రయాణాన్ని డ్రైవర్ రికార్డు చేస్తుండగా అనూహ్యంగా ఏనుగులు రోడ్డు దాటుతుండటం ఆయన కంటపడింది.
ఈ వీడియోను కర్నాటక డెవలప్మెంట్ ఇండెక్స్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో ఆన్లైన్లో షేర్ చేసినప్పటినుంచి ఇప్పటివరకూ 15 వేల మంది వీక్షించారు. 19 సెకండ్ల వ్యవధి కలిగిన ఈ వీడియోలో కర్నాటకలోని దండేలి ప్రాంతంలో రాత్రివేళ చిమ్మచీకటిగా ఉన్న రోడ్డుపై డ్రైవర్ తన వాహనంతో వెళుతుండటం కనిపిస్తుంది.
అనూహ్యంగా ఏనుగులు అటవీ ప్రాంతంలోని ఓ వైపు నుంచి మరోవైపుకు వెళ్లేందుకు రోడ్డు దాటడం కనిపిస్తుంది. అటవీ ప్రాంతంలో చుట్టూ మసీదుల నుంచి శబ్ధాలు వస్తుండటం, అటవీ ప్రాంతం తగ్గిపోతుండటంతో ఇక్కడ సంచరించే మృగాలు, జంతువుల బాగోగులపై పర్యావరణవేత్తలు ఆందోళన వయక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎలిఫెంట్ కారిడార్ ప్రదేశాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మించడం ద్వారా మానవులు, వన్యప్రాణులకు సురక్షిత వాతావరణం కల్పించవచ్చని ఓ యూజర్ వ్యాఖ్యానించారు.