Viral video: ప్రతి వ్యక్తి జీవితంలో పెండ్లికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఎన్నో ఆశలు, ఆశయాలతో రెండు జీవితాలు ఏకమయ్యే అపూర్వ ఘట్టమది. అయితే పెండ్లికి సంబంధించి చేసే వివిధ కార్యక్రమాలు, అలంకరణలు వరుడి కంటే వధువునే ఎక్కువగా అలసిపోయేలా చేస్తాయి. భారతీయ వధువులైతే మేకప్, అలంకరణ, సాంప్రదాయ కార్యక్రమాలు, ఫొటో షూట్ సెషన్లతో తీవ్రంగా అలసిపోతారు.
అలా అలసిపోయిన ఓ వధువు తెల్లవారుజామున తన పెండ్లి తంతు కొనసాగుతుండగానే నిద్రలోకి జారుకుంది. పక్కన వరుడితో పురోహితుడు ఏవో కార్యక్రమాలు చేయిస్తుండగా వధవు కూర్చునే హాయిగా కునుకు తీస్తున్నది. పెండ్లి కూతురు స్నేహితురాలు ఈ దృశ్యాన్ని తన సెల్‌ఫోన్ కెమెరాలో బంధించింది. ఈ పాత వీడియోను ఇటీవల పెండ్లి కూతురుకు పంపించగా.. ఆమె బ్యాట్టర్డ్ సూట్‌కేస్ అనే యూజర్ నేమ్‌తో ఉన్న తన ఇన్‌స్టా హ్యాండిల్లో పోస్టు చేసింది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 7.6 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. 15 వేల మంది లైక్ చేశారు. కామెంట్లు కూడా జోరుగా వస్తున్నాయి. ఈ వైరల్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి..