న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల మూడో దశలో మొత్తం 1,352 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో మహిళలు 123 మంది (9 శాతం) కాగా, క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నవారు 244 మంది (18 శాతం). 12 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 94 స్థానాల్లో మే 7న జరిగే పోలింగ్లో ఓటర్లు వీరి భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. వీరి నామినేషన్లను పరిశీలించిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), ది నేషనల్ ఎలక్షన్ వాచ్ ఈ వివరాలను వెల్లడించాయి. మూడో దశలో పోటీ చేస్తున్నవారిలో 392 మంది (29 శాతం) కోటీశ్వరులు ఉన్నారు. వీరి సగటు సంపద విలువ రూ.5.66 కోట్లు. అత్యధిక సంపన్న అభ్యర్థికిగల సంపద విలువ రూ.1,361 కోట్లు.