మీరట్ : వైద్య చరిత్రలో అత్యంత అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఒక మహిళకు గర్భాశయంలో కాకుండా కాలేయంలో 12 వారాల పిండం పెరుగుతున్నట్టు గుర్తించారు. బులంద్‌షహర్‌కు చెందిన ఈ మహిళ రెండు నెలలుగా తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలతో బాధపడుతున్నది. దీంతో తాజాగా ఆమె మీరట్‌లోని వైద్యులను సంప్రదించారు.
వారు ఎంఆర్ఐ స్కాన్ తీయడంతో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె కాలేయంలో పిండం పెరుగుతున్నట్టు బయటపడింది. పిండం గుండె కొట్టుకోవడం స్పష్టంగా కనిపించిందని, అంటే అది జీవించి ఉన్నదని, రోజురోజుకు వృద్ధి చెందుతున్నదని డాక్టర్ గుప్తా పేర్కొన్నారు. వైద్య పరిభాషలో దీనిని ఎక్టోపిక్ గర్భం రకంగా పిలుస్తారన్నారు.