లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో హృదయ విదారక ఘటన జరిగింది. ఓ ఎలక్ట్రానిక్ షాపులో పని చేస్తున్న స్వీపర్ రాకేశ్.. ఫ్లోర్‌ను శుభ్రం చేస్తూనే కుప్పకూలిపోయాడు. రాకేశ్ కుప్పకూలిపోవడాన్ని గమనించిన సహచరులు.. అతన్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాకేశ్ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాకేశ్ గుండెపోటుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. రాకేశ్ మృతికి షాపు యజమాని పరిహారం చెల్లించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
హృదయ విదారక ఘటన.. ఫ్లోర్ శుభ్రం చేస్తూ గుండెపోటుతో స్వీపర్ మృతి pic.twitter.com/RV9jE40BGX
— Namasthe Telangana (@ntdailyonline) December 26, 2021