భోపాల్: తనను ఎలాగైనా పాసయ్యేలా చూడాలంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిని పరీక్ష పత్రంలో రాసిన అభ్యర్థన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంగ్లిష్ పరీక్షలో ఫెయిల్ అయితే తండ్రి తనకు పెండ్లి చేస్తాడని, దీన్నుంచి తప్పించుకోవాలంటే తనను ఎలాగైనా పాస్ చేయాలని కోరుతూ జబల్పూర్లో ఓ విద్యార్థిని జవాబుపత్రంలో ప్రాధేయపడింది. మరో విద్యార్థి 1991లో బాలీవుడ్లో విడుదలైన సాజన్ చలనచిత్రం నుంచి ఓ పాటను జవాబుకు బదులుగా రాశాడు. వీటికి సంబంధించి జవాబుపత్రం ఫొటోలు వైరల్ అయ్యాయి.