డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో వరుణ ప్రతాపం కొనసాగుతున్నది. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వరదలకు పలుచోట్ల వంతెనలు, రహదారులు, రైల్వేట్రాక్‌లు ధ్వంసమవుతున్నాయి. గౌలా నది వరద ఉధృతికి ఈ ఉదయం ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ వద్ద కత్కోడామ్-ఢిల్లీ రైల్వే లైన్ దెబ్బతిన్నది.
ట్రాక్ కింద మట్టి, కంకర పూర్తిగా కొట్టుకుపోయాయి. దాంతో రైల్వేట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది. ట్రాక్ ధ్వంసం కావడంతో అధికారులు ఆ మార్గం గుండా వెళ్లే రైళ్ల రాకపోకలను నిలిపేశారు.
#WATCH | A portion of the railway line connecting Kathgodam and Delhi near Gaula river in Uttarakhand's Haldwani was damaged earlier today amid heavy rainfall in the region. pic.twitter.com/onYhSwhdlK
— ANI (@ANI) October 19, 2021