ముంబై: అది మహారాష్ట్ర రాజధాని ముంబైలోని రాజ్‌భవన్ ప్రాంగణం. గురువారం సాయంత్రం అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘాలు కమ్మింది. ఒంటికి చెక్కిలిగింతలు పెట్టినట్లుగా చల్లగా పిల్లగాలి వీయసాగింది. రాజ్‌భవన్‌లోని హెలిప్యాడ్ పరిసరాల్లో పచ్చిక బయలు, పచ్చని చెట్లు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. చెట్ల మీద పక్షులు కిలకిలారావాలు చేస్తున్నాయి. ఓ కోయిల కూ.. కూ.. అంటూ తీయగా పాడుతున్నది.
సరిగ్గా అప్పుడే ఒక మయూరం హెలిప్యాడ్‌పై వాలింది. కమ్మిన మేఘాలు, చల్లటి పిల్లగాలి, పచ్చని పచ్చిక బయలు, సాటి పక్షుల కిలకిల చప్పుళ్లను ఆస్వాదిస్తూ మెల్లగా పురివిప్పి నాట్యం చేసింది. ఈ దృశ్యం చూపరులకు కనువిందు చేసింది. ఈ కింది వీడియోలో మీరు కూడా ఆ నెమలి ముగ్ధ మనోహర నాట్యాన్ని వీక్షించండి.
#WATCH | A peacock spreads its wings and dances at Maharashtra Raj Bhavan Helipad In Mumbai.
— ANI (@ANI) May 6, 2021
(Video Source: Maharashtra Raj Bhavan) pic.twitter.com/zfglD7PM8o
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వర్షాలు కురువాలని కప్పలకు పెండ్లి..వీడియో
ఆర్ఎల్డీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూత
దర్శకుడికి కరోనా.. చికిత్సకు సాయం చేసిన కమెడీయన్
ఇంటినుంచే ఇంజినీరింగ్ పరీక్షలు
తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు