లక్నో : ప్లాట్‌ఫామ్ అంతా ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. అప్పుడే ఓ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చి ఆగింది. హడావుడిగా ఆ ఎక్స్‌ప్రెస్‌ను ప్రయాణికులందరూ ఎక్కేస్తున్నారు. ఓ ప్రయాణికుడు మాత్రం కాలు జారి పట్టాలపై పడిపోయాడు. అంతలోనే రైలు ముందుకు వేగంగా కదిలింది. ఇక అక్కడున్న ప్రయాణికులంతా.. ఆందోళనకు గురయ్యారు. అతను చనిపోయాడా..? బతికాడా..? అని ఊపిరి బిగపట్టి చూశారు. చివరకు అతను ప్రాణాలతో బయటపడటంతో అటు పోలీసులు, ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఎటావా జిల్లాలోని భర్తానా రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
భర్తానా రైల్వే స్టేషన్లో 30 ఏండ్ల వయసున్న భోలా సింగ్ అనే ప్రయాణికుడు ఆగ్రా ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక రైలు 2వ నెంబర్ ప్లాట్‌ఫాం మీదకు వచ్చి ఆగగానే, ప్రయాణికులందరూ ఎక్కేశారు. భోలా సింగ్ మాత్రం కాలు జారి కిందపడిపోయాడు. మొత్తానికి ఈ ప్రమాదం నుంచి భోలా సింగ్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక పట్టాలపై నుంచి లేచిన సింగ్.. థ్యాంక్ గాడ్ అంటూ చేతులు జోడించి నమస్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Earlier in the morning, a passenger identified as Bhola Singh fell on track while attempting to board Agra Fort-Lucknow junction intercity at Bharthana railway station (Etawah). Bhola survived without any injury. pic.twitter.com/WHODSvb5Nv
— Subodh Srivastava 🇮🇳 (@SuboSrivastava) September 6, 2022