Home
Telangana
Revenue Department Sources Stated That The Government Is Poised To Arbitrarily Revise Land Registration Values
అడ్డగోలుగా భూ విలువల సవరణ!
భూముల రిజిస్ట్రేషన్ విలువలను అడ్డగోలుగా సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా, అధికారుల నుంచి నివేదికలు తీసుకోకుండా పెంచేందుకు అనుమతి ఇచ్చినట్టు పేర్కొన్నాయి.
- ప్రాంతాలవారీగా జాబితా సిద్ధం
- ముసాయిదాకు మంత్రి ఆమోదం
- పోర్టల్‌లో అప్డేటే తరువాయి
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): భూముల రిజిస్ట్రేషన్ విలువలను అడ్డగోలుగా సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా, అధికారుల నుంచి నివేదికలు తీసుకోకుండా పెంచేందుకు అనుమతి ఇచ్చినట్టు పేర్కొన్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హన్మంతు మార్కెట్ విలువల పెంపు ప్రతిపాదనలతో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసినట్టు సచివాలయ వర్గాలు తెలిపాయి. వ్యవసాయ భూములను ప్రస్తుత ఓపెన్ మార్కెట్ ధరల ఆధారంగా భారీగా పెంచేందుకు అనుమతి ఇచ్చినట్టు సమాచారం. బహిరంగ మార్కెట్ ఆధారంగా అశాస్త్రీయంగా భూముల విలువను సవరిస్తే రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతింటుందని మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలు పెరిగిపోతాయని హెచ్చరిస్తున్నారు.
- గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల కనిష్ఠ ధర రూ.75 వేలు ఉండగా, రూ.3 లక్షలకు, పట్టణాల్లో రూ.6 లక్షలుగా ఉన్న ప్రస్తుత విలువలను రూ.18 లక్షలకు పెంచే అవకాశం.
- రంగారెడ్డి వంటి శివారు జిల్లాల్లో రూ.వెయ్యిగా ఉన్న చదరపు గజం రూ.5 వేలకు పెంచనున్నారట.
- మహేశ్వరంలో కనీస ధర రూ.5 వేలకుపైగా, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో కమర్షియల్ ప్లాట్లకు రూ.60 వేలుగా ఉన్న ధరను రూ.లక్షకుపైగా, మియాపూర్ వంటి ప్రాంతాల్లో కనీస ధర రూ.లక్షకుపైగా, హఫీజ్‌పేట్, కొండాపూర్‌లో రూ.1.50 లక్షలకు, రాయదుర్గంలో కనీస ధరను రూ.60 వేలకు పెంచనున్నట్టు తెలిసింది.
- గుట్టల బేగంపేట, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, మాదాపూర్, శివారు ప్రాంతాలతోపాటు, అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ రూ.లక్షకు తక్కువ కాకుండా పెంపుదల ఉండనున్నట్టు సమాచారం.
- ఫ్యూచర్‌సిటీ ప్రాంతంలో రూ.75 వేలకుపైగా మార్కెట్ విలువను ఖరారు చేయాలని నిర్ణయించారట.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

