న్యూఢిల్లీ: పిస్తా పప్పుల్లో ఊహించని విధంగా యాంటిఆక్సిడెంట్లు ఉన్నట్టు యూఎస్‌లోని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. బ్లూబెర్రీలు, దానిమ్మపండ్లు, చెర్రీలు, దుంపల్లో కంటే పిస్తాల్లో యాంటిఆక్సిడెంట్లు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటాయని కనుగొన్నారు. వీటిని రోజూ తింటే దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతున్నాయని కనుగొన్నారు. రొమ్ములు, కాలేయం, పేగు క్యాన్సర్‌కు కారణమయ్యే కణితుల పెరుగుదలను అడ్డుకొంటున్నాయని గుర్తించారు.