Swiggy | ఏడాదిలో రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్‌ను ఆర్డర్ చేశాడు : స్విగ్గీ ఆర్డర్స్‌లో మళ్లీ బిర్యానీ టాప్
ముంబైకి చెందిన ఓ వ్యక్తి 2023లో స్విగ్గీ (Swiggy) నుంచి ఏకంగా రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్‌ను ఆర్డర్ చేశారని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది.
న్యూఢిల్లీ : ముంబైకి చెందిన ఓ వ్యక్తి 2023లో స్విగ్గీ (Swiggy) నుంచి ఏకంగా రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్‌ను ఆర్డర్ చేశారని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది ముగుస్తున్న క్రమంలో ‘హౌ ఇండియా స్విగ్గ్డ్ ఇన్ 2023’ పేరుతో తన వార్షిక ఫుడ్ డెలివరీ నివేదికను విడుదల చేసింది. ఇక ఈ ఏడాది స్విగ్గీలో అత్యధిక మంది ఆర్డర్ చేసిన ఫుడ్‌గా బిర్యానీ ముందువరసలో నిలిచింది.
ఇక ముంబై వాసి 2023లో రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్‌ను ఆర్డర్ చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. బిర్యానీతో పాటు కేక్స్, గులాబ్ జామ్, పిజ్జాలనూ కస్టమర్లు అధికంగా ఆర్డర్ చేశారు. ఈ ఏడాది పొడవునా సెకన్‌కు 2.5 సర్వింగ్స్ రేటుతో బిర్యానీని ఆర్డర్ చేశారని ఈ నివేదిక తెలిపింది. గత ఎనిమిదేండ్లుగా బిర్యానీనే అత్యధికులు ఆర్డర్ చేసిన డిష్‌గా చార్ట్‌లో టాప్‌గా నిలుస్తోంది.
చికెన్ బిర్యానీకి అత్యధికులు మొగ్గుచూపగా శాకాహారులు సైతం వెజ్ బిర్యానీని ఆర్డర్ చేయడం పట్ల ఆసక్తి కనబరిచారు. భారత్ వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బిర్యానీ క్రేజ్ ఓ రేంజ్లో నెలకొంది. ఆ రోజు చండీఘఢ్‌కు చెందిన ఓ కుటుంబం ఏకంగా 70 ప్లేట్లు ఆర్డర్ చేసిందని స్విగ్గీ రిపోర్ట్ పేర్కొంది.
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

