రాజస్థాన్లోని జైసల్మేర్ వద్ద వైమానికి దళానికి చెందిన మిగ్-21 విమానం కుప్పకూలింది. ఈ సంఘటన సుదాసిరి గ్రామంలో జరిగినట్లు సమాచారం. ఈ దుర్ఘటనలో పైలట్ మృతి చెందాడు. ఈ ఘటన జరగడంతో రెస్క్యూ ఆపరేషన్ కోసం అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఏ కారణాల రీత్యా ఇది కుప్పకూలిందన్నది మాత్రం ఇంకా తెలియ రాలేదు.