Car Stunts: ఆ కారు ఓనర్‌కు 26వేల ఫైన్ వేశారు.. ఎందుకో ఈ వీడియో చూడండి
Traffic police: ఓ వ్యక్తి కారు రూఫ్‌పై స్టంట్స్ చేశాడు. ఢిల్లీ వీధుల్లో ఆ కారు దూసుకెళ్లింది. అయితే ఆ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ట్రాఫిక్ పోలీసులు ఆ కారు ఓనర్‌కు జరిమానా విధించారు. 26 వేల ఫైన్ వేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ కారు ఓనర్‌కు.. ఆ రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు 26వేల ఫైన్ వేశారు. ఆ కారుపై ఓ వ్యక్తి స్టంట్స్(Car Stunts) చేశాడు. తీవ్ర రద్దీ ఉన్న రోడ్డుమీద వెళ్తున్న సమయంలో ఆ వ్యక్తి కారుపైకి ఎక్కి విన్యాసాలు చేశాడు. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఆ కారు ఓనర్‌కు జరిమానా విధించారు. నోయిడా సెక్టార్ 18లో ఈ ఘటన జరిగింది. మారుతీ స్విఫ్ట్ కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉంది. ఆ కారుకు ఫైన్ వేసిన చెలాన్ను ట్రాఫిక్ పోలీసులు తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేశారు. ఆ కారు ఓనర్ పేరు మహేశ్ పాల్ అని ఉంది.
उक्त शिकायत का संज्ञान लेते हुए संबंधित वाहन के विरुद्ध यातायात नियमों का उल्लंघन करने पर नियमानुसार ई-चालान (जुर्माना 26000/- रुपए) की कार्यवाही की गई है।
यातायात हेल्पलाइन नं0- 9971009001 pic.twitter.com/rWERrY3NCT— Noida Traffic Police (@Noidatraffic) August 16, 2023
ఎల్లో రంగ షర్ట్ వేసుకున్న ఓ వ్యక్తి స్విఫ్ట్ కారు రూఫ్‌పై పడుకుని స్టంట్స్ చేశాడు. మరో వ్యక్తి ఆ కారును నడిపాడు. 20 సెకన్లు ఉన్న ఆ క్లిప్‌లో కారు దూసుకెళ్లున్న దృశ్యాలను చూడవచ్చు. కారు రూఫ్‌ను పట్టుకున్న ఆ వ్యక్తి వేలాడుతున్నా.. డ్రైవర్ మాత్రం ఓవర్టేక్ చేస్తూ వెళ్లాడు. నెటిజన్లు ఈ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేయడంతో ట్రాఫిక్ పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఎంవీ యాక్ట్‌తో పాటు టిన్టెడ్ గ్లాసు వాడినందుకు ఫైన్ వసూల్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

