ఓ వ్యక్తి సమోసాలు అమ్మే దుకాణానికి వెళ్లాడు. సమోసాలు పార్సిల్ తీసుకున్నాడు. పార్సిల్‌తోపాటు ప్లేట్, స్పూన్ కావాలని అతడు కోరాడు. దీనికి సమోసా ప్యాక్ చేసిన వ్యక్తి నిరాకరించాడు. పార్సిల్‌కు అవి ఇవ్వబోమని చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన సదరు వ్యక్తి ఏకంగా సీఎం హెల్ప్‌లైన్‌కు డయల్ చేసి, ఫిర్యాదు చేశాడు. ఈ వింత సంఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
వంశ్ బహదూర్ అనే వ్యక్తి ఛతర్పూర్ బస్టాండ్‌లోని రాకేశ్ సమోసా సెంటర్‌కు వెళ్లాడు. సమోసా ప్యాక్ చేసిన వ్యక్తి చెంచా, గిన్నె ఇవ్వలేదు. దీంతో వంశ్ బహదూర్ సీఎం హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశాడు. దయచేసి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరాడు. ఆగస్టు 30న ఈ ఫిర్యాదు చేయగా, సీఎం హెల్ప్‌లైన్ అంగీకరించడం గమనార్హం. అయితే, సెప్టెంబర్ 5న ఈ ఫిర్యాదును రద్దు చేశారు. బహదూర్ ఫిర్యాదు ఐదు రోజులకు పైగా దాఖలయ్యిందని, మేధోమథనం చేసిన తర్వాతే దాన్ని క్లోజ్ చేసినట్టు సీఎంవో వర్గాలు తెలిపారు. కాగా, ఈ వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.