న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి జ్ఞాపకశక్తి విషయంలో అద్భుతం జరిగింది. 16 ఏండ్ల వయస్సులో అతడు ఒక ప్రమాదంలో జ్ఞాపకశక్తి కోల్పోయి 45 ఏండ్ల పాటు కుటుంబానికి దూరంగా జీవించాడు. ఇటీవల జరిగిన ఒక ప్రమాదంలో జ్ఞాపకశక్తి తిరిగి రావడంతో కుటుంబ సభ్యులను సంతోషంగా కలుసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. రిఖీ రామ్ సిర్మౌర్ జిల్లాలో నదీ అనే చిన్న గ్రామంలో ఉండేవాడు.
1980లో ఘోర రోడ్డు ప్రమాదంలో తలకు దెబ్బ తగిలి జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. కుటుంబంతో సంబంధం తెగిపోవడంతో ఓ కాలేజీలో పని చేస్తూ బతికాడు. ఇటీవల మరో రోడ్డు ప్రమాదం తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకు రావడంతో ఆన్లైన్ ద్వారా తన సొంత గ్రామంలోని కేఫ్ నెంబర్ను కనుగొని తద్వారా తన కుటుంబాన్ని కలిశాడు.