భోపాల్: ఒక వ్యక్తి తనను కిడ్నాప్ చేసిన వారి స్మార్ట్ వాచ్‌ని ఉపయోగించి బయటపడ్డాడు. సౌరభ్ శర్మ (25) హరిద్వార్‌లో ఒక హోటల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. చోటు త్యాగి, సచిన్ త్యాగిల నుంచి రూ. 2.9 లక్షలు అప్పు తీసుకున్నాడు. వారికి 3.2 లక్షలు చెల్లించినా వడ్డీతో ఇంకా ఆరు లక్షలు చెల్లించాలని పేర్కొంటూ గ్వాలియర్‌లో అతడిని కిడ్నాప్ చేసి బంధించి తీవ్రంగా కొట్టారు.
అయితే బంధించిన గదిలో సచిన్ స్మార్ట్ వాచ్ ఉండటంతో తన గర్ల్ ఫ్రెండ్‌కు శర్మ ఎస్ఓఎస్ సందేశాన్ని పంపాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు శర్మను విడిపించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.