సూర్యుడికి దూరమవుతున్న భూమి.. భవిష్యత్తులో తీవ్ర నష్టాలు తప్పవా?
- క్రమంగా మందగిస్తున్న భూ భ్రమణ వేగం
- అంతర్గత పొరలు, సూర్యుడిలో మార్పులే ఇందుకు కారణం
- భవిష్యత్తులో తీవ్ర నష్టాలు తప్పవంటున్న శాస్త్రవేత్తలు
నేషనల్ డెస్క్: సూర్యుడి నుంచి భూమి దూరంగా జరుగుతున్నదని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఏటా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఈ దూరం నమోదవుతున్నట్టు వెల్లడించారు. అలాగే, భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం (భ్రమణ వేగం) పెరిగిందని ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి. జూలై 26న నిర్ణీత 24 గంటలకు ముందే అంటే 1.59 మిల్లీ సెకండ్ల ముందే భూమి తన భ్రమణాన్ని పూర్తి చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఆ రికార్డు ఆ రోజుకే పరిమితమైందని, ప్రస్తుతం భూమి భ్రమణ వేగం క్రమంగా మందగిస్తున్నదని శాస్త్రవేత్తలు తెలిపారు.
సూర్యుడి నుంచి భూమి ప్రతీఏడాది ఆరు సెంటీమీటర్ల మేర దూరం జరుగుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు తాజాగా గుర్తించారు. అలాగే ప్రతీ వందేండ్లకు సగటున భూ భ్రమణ సమయం 2.3 మిల్లీ సెకండ్ల మేర పెరుగుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియా శాస్త్రవేత్తలు వెల్లడించారు. వందల కోట్ల ఏండ్ల క్రితం భూమి తన చుట్టూ తాను తిరగానికి 19 గంటల సమయం మాత్రమే పట్టేది. కాలక్రమేణా అది 24 గంటలకు చేరింది. అంటే కాలం గడుస్తున్న కొద్దీ భూమి భ్రమణ వేగం పెరుగుతుందని అర్థం చేసుకోవాలి.
మార్పులకు కారణాలు ఇవే
సూర్యుడి నుంచి భూమి దూరంగా జరిగిపోవడానికి కారణం సూర్యుడు తన ద్రవ్యరాశిని కోల్పోవడమేనని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. న్యూక్లియర్ ఫ్యూజన్ కారణంగా ద్రవ్యరాశిని శక్తిగా మార్చుతున్న సూర్యుడు ఆ కాంతిని విశ్వాంతరాళంలోకి వెదజల్లుతున్నాడు. ఈ క్రమంలో తన ద్రవ్యరాశిని క్రమంగా కోల్పోతున్నాడు. ద్రవ్యరాశిలో తగ్గుదల గురుత్వాకర్షణ శక్తిని బలహీనం చేస్తుంది. దీంతో గురుత్వాకర్షణ శక్తి వీక్‌గా మారడంతో భూమి సూర్యుడికి దూరంగా జరుగుతున్నది.
భూమి భ్రమణ వేగంలో మార్పులకు కారణాలను ఇప్పటివరకూ శాస్త్రవేత్తలు కచ్చితంగా కనుగొనలేకపోయారు. అయి తే, భూమి లోపలి, బయటి పొరల్లో మార్పులు, మహాసముద్రాల్లో ఆటుపోట్లు, వాతావరణంలో పెను మార్పులు జరుగుతుండటంతో ధ్రువాల వద్ద ఉన్న మంచు పెద్దమొత్తంలో కరుగడం, భౌగోళిక ధ్రువాల్లో కదలికలు, భూకంపాలు వగైరా భూభ్రమణ వేగంలో మార్పునకు కారణంగా అంచనా వేస్తున్నారు.
నష్టాలేమిటి?
ఇక సూర్యుడి నుంచి భూమి దూరంగా జరిగితే వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవచ్చు. కాలాల్లో పెను మార్పులు జరుగొచ్చు. భూమ్యాకర్షణ శక్తిలో హెచ్చతగ్గులు చోటుచేసుకోవడంతో సమాచార వ్యవస్థలో, మనుషులు, జంతువుల దైనందిన జీవితంలో మార్పులు చోటుచేసుకోవచ్చు. సూర్యుడి నుంచి భూమి దూరం మరింత పెరిగితే మళ్లీ మంచుయుగం నాటి పరిస్థితులు తలెత్తవచ్చని చెబుతున్నారు.
భూభ్రమణ వేగంలో మార్పు నెగెటివ్ లీప్ సెకండ్లకు దారి తీస్తుందని పరిశోధకులు అనుమానిస్తున్నారు. అంటే సమయంలో తేడాకు కారణమవుతుందని అర్థం. ఇదే జరిగితే, అంతర్జాతీయంగా పలు రోజూవారీ కార్యక్రమాల్లో గందరగోళం తలెత్తుతుంది. ఈ ప్రభావం.. కంప్యూటర్ ప్రోగ్రామ్‌లను క్రాష్ చేసి డాటా స్టోరేజీని కూడా దెబ్బతీయొచ్చని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Earth
- Earth's rotation
- sun
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

