ముంబై: మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాలనే డిమాండ్‌తో నాలుగు కిలోమీటర్ల పొడవైన చీరను ఓ పిటిషన్‌గా రూపొందించారు. దీనిని ముంబైలోని రాయల్ ఒపెరా హౌస్‌లో ఆవిష్కరించారు. దీనిని ముంబైలోని కాలా ఘోడా ఆర్ట్స్ ఫెస్టివల్లో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 8 వరకు ప్రదర్శిస్తారు.
భర్తతో శృంగారం చేయడానికి ఇష్టం లేదని చెప్పే హక్కు వివాహిత మహిళలకు ఉందనే సందేశానికి మద్దతిచ్చే వారు దీనిపై సంతకాలు చేయవచ్చు. దీనిని డిజైనర్ నివేదిత సబూ, ఫిల్మ్ మేకర్ సుప్రీత్ కే సింగ్ రూపొందించారు. సింగ్ మాట్లాడుతూ ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు భర్త కారణంగా లైంగిక హింసకు గురవుతున్నారని, అయినప్పటికీ, భార్యలకు రక్షణ ఉండటం లేదని చెప్పారు. వద్దు అని చెప్పే హక్కు వివాహంతో అంతం కాదన్నారు.