ముంబై: ఖరీదైన లగ్జరీ రేస్ కారు బీచ్‌లోని ఇసుకలో కూరుకుపోయింది. దానిని బయటకు తీసేందుకు కొందరు ప్రయత్నించి విఫలమయ్యారు. చివరకు ఎడ్ల బండి సహాయంతో ఆ కారును బయటకు లాగారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Bullock Cart Pulls Ferrari) మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ముంబైకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఫెరారీ కారులో రాయ్‌గఢ్‌లోని రెవ్దండా బీచ్‌కు చేరుకున్నారు. అయితే ఆ బీచ్‌లోని ఇసుకలో ఫెరారీ కారు టైర్లు కూరుకుపోయాయి. దీంతో ఆ కారు అక్కడ చిక్కుకుని ముందుకు కదలలేదు.
కాగా, లగ్జరీ కారును తోసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇంతలో ఒక ఎడ్ల బండి అటుగా వెళ్లడాని కారు యజమాని గమనించాడు. ఎడ్ల బండి యజమాని వద్దకు వెళ్లి సహాయం కోరాడు. ఈ నేపథ్యంలో ఖరీదైన ఫెరారీ కారుకు తాడు కట్టారు. ఇసుకలో చిక్కుకున్న దానిని ఎద్దుల బలంతో బయటకు లాగారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Bullock pulling Ferrari in Alibaug 🙏🏻😂 pic.twitter.com/udifWxaMK4
— Facts (@BefittingFacts) December 31, 2024