Farmer | ముంబై, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాకు చెందిన ఓ రైతు తన వ్యవసాయ భూమిలో ఉన్న ఓ చెట్టుతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. పుసాద్ తాలూకా ఖుర్షి గ్రామంలో నివసించే కేశవ్ షిండేకు 7 ఎకరాల పూర్వీకుల పొలంలో ఒక రక్త చందన చెట్టు ఉంది. కోట్లలో విలువ చేసే దాని గురించి వారికి తెలియదు. ఒక ప్రాజెక్టు కోసం రైల్వే ఈ భూమిని స్వాధీనం చేసుకుంది.
తర్వాత చెట్టు గురించి తెలిసి అంచనా వేయిస్తే దాని విలువ రూ.4.97 కోట్లుగా తేల్చింది. అయితే అంత మొత్తం ఇవ్వడానికి రైల్వేశాఖ నిరాకరించింది. దీంతో షిండే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ చెట్టు విలువ మదింపునకు ముందస్తుగా కోటి రూపాయలు జమ చేయాలని రైల్వే శాఖను కోర్టు ఆదేశించింది.