కశ్మీర్లో మళ్లీ డ్రోన్ కలకలం.. 15 రోజుల్లో ఆరోసారి
డ్రోన్ కలకలం| జమ్ముకశ్మీర్‌లో మరోమారు డ్రోన్ కలకలం సృష్టించింది. కశ్మీర్‌లోని ఆర్ణియా సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రోన్ సంచరించింది. మంగళవారం అర్థరాత్రి 100 నుంచి 150 మీటర్లు భారత భూభాగంలోకి వచ్చిన డ్రోన్‌ను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) గుర్తించింది.

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో మరోమారు డ్రోన్ కలకలం సృష్టించింది. కశ్మీర్‌లోని ఆర్ణియా సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రోన్ సంచరించింది. మంగళవారం అర్థరాత్రి 100 నుంచి 150 మీటర్లు భారత భూభాగంలోకి వచ్చిన డ్రోన్‌ను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) గుర్తించింది. దీంతో డ్రోన్‌పై సైనికులు కాల్పులు జరిపారని, అనంతరం అది అక్కడి నుంచి అదృష్యమయిందని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దు వద్దనున్న సాయ్ గ్రామానికి సమీపంలో డ్రోన్ కనిపిందని, అది గూఢచర్యం గానీ, ఆయుధాలను జారవిడచడంగాని చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ‘ఎరుపు రంగు కాంతితో 200 మీటర్ల ఎత్తులో ఓ వస్తువు కనిపించింది. కాల్పులు జరపగానే అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ ప్రాంతంలో గాలించినప్పటికీ దొరకలేదు’ అని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు.
కాగా, కశ్మీర్‌లోని సరిహద్దుల్లో డ్రోన్ సంచరించడం గత 15 రోజుల్లో ఇది 15వ సారి. గత నెలలో కశ్మీర్‌లోని జమ్ము ఎయిర్‌పోర్టులో డ్రోన్ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో ఎయిర్‌పోర్టులోని టెక్నికల్ సెక్షన్ ధ్వసమవడం, ఇద్దరు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది గాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

