కోయంబత్తూర్, జూలై 7: తమిళనాడులో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని డీఐజీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీ విజయ్‌కుమార్ అనే ఐపీఎస్ అధికారి శుక్రవారం నగరంలో రెడ్ ఫీల్డ్స్‌లోని తన ఇంట్లోనే సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
కోయంబత్తూర్ సర్కిల్లో డీఐజీగా పనిచేస్తున్న విజయ్ కుమార్ మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆ రేంజి లా అండ్ ఆర్డర్ విభాగం ఏడీజీపీ ఏ ఆరుణ్ తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం విజయ్‌కుమార్ గత కొన్ని ఏండ్లుగా మానసిక ఒత్తిడితో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్టు తెలిసిందని చెప్పారు. విజయ్‌కుమార్ మరణానికి రాజకీయ కారణాలు కూడా ఏమీ లేవని తమ దర్యాప్తులో తేలిందన్నారు.