ముంబై : వారానికి 70 గంటలు పని చేయాలని, 90 గంటలు పని చేయడంతో పాటు ఆదివారాలూ ఆఫీసులకు రావాలని పెద్ద కంపెనీల బాసులు చెప్తుంటే.. రెడ్ ఇన్ ది వైట్ అనే యాడ్ ఏజెన్సీ టైమ్‌కు పని ముగించాలనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నది. తమ ఉద్యోగులు రాత్రి 7 అయ్యిందంటే కచ్చితంగా లాగ్ఆఫ్ చేయాలని చెప్తామని సంస్థ ఫౌండర్ ప్రణిత బజోరియా తెలిపారు.