చెన్నై: జల్లికట్టు ఉత్సవం..! తమిళనాడు రాష్ట్రంలో ఇది అనాదిగా వస్తున్న ఆచారం..! ప్రతి సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు ఉత్సవం జరుపుకుంటారు. జల్లికట్టు అంటే ఎద్దులను, కోడెలను బెదరగొట్టి ఒక మార్గం గుండా గుంపులుగా వదిలిపెడుతారు. గుంపులుగా పరుగులు తీస్తున్న ఎద్దులను యువకులు లొంగిదీసే ప్రయత్నం చేస్తారు. అలా లొంగదీసిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. అయితే మనుషులు, ఎద్దులు తీవ్రంగా గాయపడే అవకాశం ఉన్న ఈ ఉత్సవంపై ప్రభుత్వ నిషేధం ఉన్నది.
అయినా, తమిళనాడు ప్రభుత్వం ప్రతి ఏడాది సుప్రీంకోర్టు అనుమతి తీసుకుని ఈ ఉత్సవానికి అవకాశం కల్పిస్తున్నది. ఈసారి కూడా తమిళనాడు అంతటా జల్లికట్టు ఉత్సవం జోరుగా కొనసాగింది. అయితే, పాలమేడులో జల్లికట్టు సందర్భంగా ఓ వ్యక్తి కర్ర తీసుకుని ఎద్దులను విచక్షణారహితంగా కొడుతున్న వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేసిన మధురై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అతని మీద జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని మధురై జిల్లా ఎస్పీ వీ భాస్కరన్ వెల్లడించారు. పాలమేడులో జల్లికట్టు సందర్భంగా నిందితుడు ఎద్దులను కొడుతున్న దృశ్యాలను ఈ కింది వీడియోలో చూడొచ్చు..
Tamil Nadu | A case has been registered under 'Prevention of Cruelty to Animals Act' against a person for attacking bulls with a stick in Palamedu Jallikattu. Following this, Madurai Police conducted an investigation & arrested him: V. Baskaran, Madurai SP
— ANI (@ANI) January 20, 2022
(Video from Jan 15) pic.twitter.com/VIVgZwecaS