న్యూఢిల్లీ: మయన్మార్ నుంచి దాదాపు 300 మంది రోహింగ్యాలతో బయల్దేరిన ఓ పడవ సముద్రంలో మునిగిపోయింది. ఆదివారం థాయిలాండ్-మలేసియా సరిహద్దుకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుందని, కేవలం 10 మంది ప్రాణాలతో బయటపడ్డారని, ఒకరి మృతదేహం లభించిందని మలేసియా మార్టైమ్ అథారిటీ హెడ్ ముస్తఫా చెప్పారు. పడవలోని మిగతావాళ్ల ఆచూకీ గల్లంతైందని అధికారులు చెబుతున్నారు.
సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు తెలిపారు. మయన్మార్‌లోని బటిండాగ్ నుంచి వందలాది మంది రోహింగ్యా శరణార్థులతో ఈ పడవ బయల్దేరి ఉంటుందని, మయన్మార్‌లో నెలకొన్న దారుణమైన పరిస్థితులతో వారంతా ఆ దేశం నుంచి పారిపోతున్నారని ‘రాయిటర్స్’ కథనం పేర్కొన్నది.