న్యూఢిల్లీ: ఓ 25 ఏళ్ల యువకుడు టికెట్ తీసుకుని మెట్రో స్టేషన్లో ప్రవేశించాడు. ఆ తర్వాత ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చి ట్రెయిన్ కోసం వేచి చూశాడు. రైలు ప్లాట్‌ఫామ్ మీదకు వస్తుండగానే ఒక్కసారిగా దాని ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలోని కైలాస్ కాలనీ మెట్రో స్టేషన్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, ట్రాక్ పైనుంచి మృతదేహాన్ని తొలగించారు. అనంతరం పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రాథమిక విచారణలో నిందితుడు కైలాష్ కాలనీ తూర్పు ప్రాంతానికి చెందిన అజయ్ అర్జున్ శర్మగా గుర్తించారు.