అక్కా చెల్లెళ్లపై లైంగిక దాడి
మధ్యప్రదేశ్‌లోని దాతియా జిల్లాలో దారుణం జరిగింది. 19 ఏండ్ల యువతిపై ఉన్నావో(యూపీ)కు చెందిన నలుగురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి చెల్లెలిపైనా లైంగికదాడికి ఒడిగట్టారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ప్రాతినిధ్యం వహిస్తున్న దాతియా నియోజకవర్గం పరిధిలో శుక్రవారం ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది.
భోపాల్, జూలై 16: మధ్యప్రదేశ్‌లోని దాతియా జిల్లాలో దారుణం జరిగింది. 19 ఏండ్ల యువతిపై ఉన్నావో(యూపీ)కు చెందిన నలుగురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి చెల్లెలిపైనా లైంగికదాడికి ఒడిగట్టారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ప్రాతినిధ్యం వహిస్తున్న దాతియా నియోజకవర్గం పరిధిలో శుక్రవారం ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి నుంచి తీసుకున్న ఫిర్యాదు ఆధారంగా నిందితుల్లో ఒకరు స్థానిక బీజేపీ నాయకుడి కుమారుడు ఉన్నాడని తెలిసింది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. నిందితుల్లో ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో బాధితుల బంధువులు, స్థానికులు దాతియా పోలిస్ స్టేషన్‌కు చేరుకొని నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
బాధితుల్లో ఒకరు ఆత్మహత్యకు ప్రయత్నించారని, అయితే ఆమెను వెంటనే దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులు విద్యార్థులని, ఘటనపై విచారణ జరుపుతున్నామని దాతియా జిల్లా ఎస్పీ ప్రదీప్ శర్మ తెలిపారు. వారిపై పోక్సో సహా ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. నిందితులు యువతి, ఆమె చెల్లెల్ని బలవంతంగా ఓ ఇంట్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపారు. లైంగిక దాడి ఘటనను దాతియా జిల్లా బీజేపీ అధ్యక్షుడు సురేంద్ర బుధోలియా తీవ్రంగా ఖండించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

