SC Atrocity Cases | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దేశంలో షెడ్యూల్డ్ కులాల వారిపై 2022లో జరిగిన మొత్తం దౌర్జన్యం కేసులలో 97.7 శాతం కేసులు 13 రాష్ర్టాలలోనే చోటుచేసుకున్నాయి. వీటిలో యూపీ అగ్రస్థానంలో ఉండగా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో 2020తో పోలిస్తే ఆ ఏడాది కేసులలో శిక్షపడిన వారి సంఖ్య 39.2 నుంచి 32.4 శాతానికి పడిపోయింది. అలాగే షెడ్యూల్డ్ కేస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (దౌర్జన్యాల నివారణ) చట్టం ప్రకారం దేశం మొత్తంలో ఎస్టీలపై 2022లో జరిగిన దౌర్జన్యాలలో 98.91 శాతం 13 రాష్ర్టాలలో నమోదయ్యాయని ప్రభుత్వ తాజా నివేదిక తెలియజేసింది.
ఎస్సీలపై 2022లో జరిగిన దౌర్జన్యాలపై మొత్తం 52,886 కేసులకు ఈ 13 రాష్ర్టాలలో 51,566 కేసులు నమోదయ్యాయి. వాటిలో యూపీలో 12,287 (23.78 శాతం), రాజస్థాన్లో 8,651 (16.75 శాతం), ఎంపీలో 7,732 (14. 97), బీహార్లో 6,799 (13.16 శాతం), ఒడిశాలో 3,576 (6.93 శాతం), మహారాష్ట్రలో 2,706 (5.24 శాతం) కేసులు నమోదయ్యాయి. ఇక ఎస్టీలపై 2022లో మొత్తం కేసులు 9,735కు ఎక్కువగా ఎం పీలో 2,979 (30.61శాతం) నమోదయ్యాయి.