న్యూఢిల్లీ : మనవడి పెండ్లి అంటే ఏ తాతకైనా సంబరమే. తన ఎదుట అల్లారుముద్దుగా ఎదిగిన మనవడు మనువాడుతున్న వేళ 96 ఏండ్ల వయసులో ఆ తాత మురిసిపోయాడు. మనవడి పెండ్లిలో డ్యాన్స్ చేస్తూ (Viral Video )అందరిలో జోష్ నింపాడు. అతిధులు ప్రోత్సహిస్తుండగా చిందేసిన తాత వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. నేపాల్‌లో ఈ ఘటనను రికార్డు చేశారు.
ఎవిరిథింగ్ ఎబౌట్ నేపాల్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 76,000కుపైగా వ్యూస్ లభించాయి. నేపాలి మ్యూజిక్కు అనుగుణంగా తాత వేసిన క్రేజీ స్టెప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. వయసును మరిచిన తాత మనవడి పెండ్లిలో హుషారుగా డ్యాన్స్ చేయడంతో నెటిజన్లు ఫిదా అయ్యారు.
ప్రేమను కనబరిచే సమయంలో వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమే..! మనవడి పెండ్లిలో 96 ఏండ్ల తాత ఎలా డ్యాన్స్ చేశాడో చూడందని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. తాత డ్యాన్సింగ్ స్టైల్ అద్భుతమని ఈ వయసులో ఆయన క్రేజీ స్టెప్స్‌తో అదరగొట్టాడని కామెంట్స్ సెక్షన్లో యూజర్లు హోరెత్తించారు.
Read More