షాహ్దోల్: లిఫ్ట్ ఇస్తానని మభ్య పెట్టి 90 ఏండ్ల వృద్ధురాలిపై ఒక బైకర్ లైంగికదాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకొన్నది. జబల్పూర్ నుంచి వచ్చిన ఒక వృద్ధురాలు షాహ్దోల్ రైల్వే స్టేషన్లో దిగింది. అక్కడి నుంచి తన బంధువు స్వగ్రామమైన ఆంత్రాకు వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆటోడ్రైవర్ ఆమెను గ్రామానికి సమీపంలోని మెయిన్రోడ్పైనే వదిలేసి వెళ్లిపోయాడు. బస్సు కోసం ఎదురుచూస్తుండగా బైకర్ వచ్చి లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించుకొన్నాడు. నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. తిరిగి ఆమెను రోడ్డుపై విడిచిపెట్టి పరారయ్యాడు.